‘మహా’తాకిడి

` మహారాష్ట్రపై కరోనా పంజా.. ఒక్కరోజే 328 కేసు
ముంబయి,ఏప్రిల్‌ 18(జనంసాక్షి):కరోనా మహమ్మారి విసిరిన పంజాకు మహారాష్ట్ర వివిలాడుతోంది. రికార్డు స్థాయిలో కేసు నమోదవుతుండటంతో కొవిడ్‌ 19 ప్రభావం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 328 పాజిటివ్‌ కేసు నమోదు కాగా.. వీటిలో ఒక్క ముంబయి మహానగరం పరిధిలోనే 184 కేసు రావడం అక్కడి తీవ్రతకు అద్దంపడుతోంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసు సంఖ్య 3648కి చేరినట్టు వైద్యశాఖ వ్లెడిరచింది. ఇప్పటివరకు మహారాష్ట్రలో 200 మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే.దేశంలో కరోనా వైరస్‌తో సంభవిస్తున్న మరణా రేటు 3.3 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్‌ సెక్రటరీ వ్‌ అగర్వాల్‌ తెలిపారు. ఇవాళ ఆయన విూడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వ్లెడిరచారు. వయసు వారిగా మరణా రేటును ఆయన తెలిపారు. 0`45 ఏళ్ల మధ్య ఉన్న వారు 14.4 శాతం, 45`60 ఏళ్ల మధ్య ఉన్న వారు 10.3 శాతం, 60`75 ఏళ్ల మధ్య ఉన్న వారు 33.1 శాతం, 75 ఏళ్లకు పైబడిన వారు 42.2 శాతం మరణిస్తున్నారని అగర్వాల్‌ చెప్పారు. వైరస్‌ సంక్రమణ రేటు 83 శాతం ఉన్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 1992 మంది వైరస్‌ చికిత్స పొంది కోుకున్నారన్నారు. కోుకున్నవారి సంఖ్య 13.85 శాతంగా ఉందన్నారు. గత 24 గంటల్లో కొత్తగా 991 కరోనా పాజిటివ్‌ కేసు నమోదు అయ్యాయన్నారు. దీంతో మొత్తం సంఖ్య 14,378కి చేరుకున్నదన్నారు. ఇక దేశవ్యాప్తంగా మరణా సంఖ్య 480కి చేరిందన్నారు. 23 రాష్ట్రాల్లో ఉన్న 47 జిల్లాల్లో పాజిటివ్‌ ట్రెండ్‌ ఉన్నట్లు అగర్వాల్‌ తెలిపారు. పుదుచరిలోని మాహే, కర్నాటకలోని కొడగు జిల్లాల్లో గత 28 రోజుల్లో ఎటువంటి పాజిటివ్‌ కేసు నమోదు కాలేదన్నారు. మరో 45 జిల్లాల్లో గత 14 రోజుల్లో కొత్త కేసు నమోదు కాలేదన్నారు. మొత్తం 14,378 కేసుల్లో.. మర్కజ్‌కు సంబంధించి 4291 కేసు ఉన్నట్లు అగర్వాల్‌ తెలిపారు. మర్కజ్‌తో లింకున్న కేసు 23 రాష్ట్రాల్లో బయటపడినట్లు చెప్పారు. తమిళనాడులో 84 శాతం, ఢల్లీిలో 63 శాతం, తెంగాణలో 79 శాతం, యూపీలో 59 శాతం, ఏపీలో 61 శాతం కేసున్నీ మర్కజ్‌తో లింకున్నవే అని అన్నారు.