మహాత్ముడి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు పాటుపడాలి
– ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ హుజూర్ నగర్ అక్టోబర్ 2(జనం సాక్షి): మహాత్ముడి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు పాటు పడాలనీ హుజూర్ నగర్ ఎంపీపీ గూడెపు శ్రీనివాసు కోరారు. ఆదివారం హుజూర్ నగర్ పట్టణంలోని మండల ప్రజా పరిషత్ భవనంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసిన మహానీయుడు గాంధీ అని కొనియాడారు. అహింసా మార్గంలో స్వాతంత్రాన్ని సాధించి ప్రపంచంలోనే భారతదేశానికి ఒక గొప్ప మహోన్నతమైన స్థానాన్ని కల్పించారని ఆయన ఆశ సాధనకు ప్రతి ఒక్కరు పాటుపడాలని యువతకు పిలుపునిచ్చారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు పెట్టడం ఎంతో అభినందనీయమని అన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన మహానీయుల స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ మౌలానా, చంద్రకళ, సాయి లక్ష్మి, దుర్గయ్య, స్రవంతి, పాల్గొన్నారు.