మహాత్మ జ్యోతిబాపూలే బిసి సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించిన ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్
జనం సాక్షి:- 26 రాయికల్ మండల అల్లిపూర్ గ్రామంలో మహాత్మ జ్యోతిబాపూలే బిసి సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించిన జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ గారు. మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో ఉన్న సమస్యలపై పాఠశాల అధ్యాపకులతో చర్చించి సంబంధిత అధికారులు జాయింట్ కలెక్టర్, ఈఈ ఆర్ అండ్ బి,బి సి వెల్ఫేర్ అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, పాఠశాలలో వసతులు మెరుగు పరచాలని,భోజనం లో మెను పాటించాలని ఆదేశించడం జరిగింది,విద్యార్థులు తల్లి దండ్రులు ఏమైనా సమస్యలు ఉంటే అధికారులకు లేదా తన దృష్టికి తీసుకురావాలని ఇటువంటి భారీ వర్షాలు,కరోనా క్లిష్ట పరిస్థితుల్లో సమస్యలు ఉంటే కొంత సంయమనం పాటించాలని కోరారు,విద్యార్థులకు మెరుగైన సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాక్స్ ఛైర్మెన్ రాజలింగం,ఎంపీటీసీ విజయ లక్ష్మి వెంకటేష్,మండల కో ఆప్షన్ సభ్యులు ముకీధ్,ఉప సర్పంచ్ సాగర్ రావు, గ్రామ శాక అధ్యక్షులు రత్నాకర్ రావు,మండల పార్టీ ఉపాధ్యక్షులు మహేష్,నాయకులు వెంకటేష్,శ్రీనివాస్,జగదీశ్ ,ముజాజ్ ,జంగీర్ ,గణపతి ,భూమయ్య,యూత్ అధ్యక్షుడు ప్రశాంత్,ప్రిన్సిపల్ వేంకట రమణ,అధ్యాపకులు,తదితరులు పాల్గొన్నారు.