మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ బాలికల హాస్టల్ తరలించదు

కరీంనగర్ టౌన్ అక్టోబర్ 12(జనం సాక్షి)

కరీంనగర్ పట్టణంలో ఉన్న శర్మ నగర్ లోని మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల హాస్టల్, తల్లిదండ్రులకు విద్యార్థులకు తెలియకుండా అక్రమంగా తిమ్మాపూర్ కు తరలించడాన్నీ నిరసిస్తూ గత రెండు రోజులుగా ఆందోళనలు చేయడం జరుగుతుంది. బుధ వారం స్కూల్ ముందు నిరసన తెలిపి రోడ్డుపై విద్యార్థులు తల్లిదండ్రులతో కలిపి రాస్తారోకో చేస్తున్న వారిని ఎస్ఎఫ్ఐ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి త్రి టౌన్ పోలీసు స్టేషన్ కి తరలించడం జరిగింది చేయడం
ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి శనిగరపు రజినీకాంత్ మాట్లాడుతూ గత రెండు రోజుల నుండి మహాత్మా జ్యోతిరావు పూలే అమ్మాయిల గురుకుల హాస్టల్ తరలించవద్దని ఆందోళన చేస్తున్న కనీసం బిసి గురుకుల రీజినల్ కోఆర్డినేటర్ ఆర్ సి ఓ కనీసం స్పందించకపోవడం సిగ్గుచేటు పాఠశాల ప్రారంభమై ఐదు నెలలు గడుస్తున్న సందర్భంలో మధ్యంతరంగా శర్మ నగర్ లో ఉన్న బీసీ గురుకుల బాలిక హాస్టల్లో ఉన్న 450 మంది విద్యార్థులను తరలించి అందులోనే నూతనంగా మరొక గురుకులను ఏర్పాటు చేయడం కోసమే అధికారులు ప్రయత్నం చేస్తున్నారు, కనీసము సదుపాయాలు లేని చోట తిమ్మాపూర్ కి తరలించడం పురాతన పాఠశాల శిథిలావస్థలో ఉన్నది,విద్యార్థులకు సరిపడా రూమ్స్ లేవు, పాములు,తేళ్లు వస్తున్నాయి అని అక్కడ ప్రస్తుతం ఉన్న విద్యార్థులు ఆందోళన చెందడం జరుగుతుంది ఈరోజు ఆందోళన చేస్తున్న విద్యార్థి తల్లిదండ్రుల పై చెయ్ చేసుకున్న పోలీస్ ల పై చర్యలు తీసుకోవాలి,ఎస్ ఎఫ్ ఐ నాయకు చేతులకు గాయాలు కావడం జరిగింది, అదే విధంగా తక్షణమే జిల్లా బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పందించి హాస్టల్ ప్రస్తుతము ఉన్న వద్ద కొనసాగించాలి అని డిమాండ్ చేయడం జరుగుతుంది విద్యార్థి ఉద్యమాలను అణిచి వేయాలని చూస్తున్న కరీంనగర్ పోలీసులు జిల్లా వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో మౌలిక వసతులు కల్పించి పౌష్టికాహారమైన భోజనం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరడం జరిగింది లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కంపెళ్లి అరవింద్,తిప్పారపు రోహిత్,జిల్లా కమిటీ సభ్యులు నాగుల శివకుమార్,సాయి,అనిల్,సంపత్,తదితరులు పాల్గొన్నారు