మహానంది జాతీయ అవార్డును అందుకున్న సుతారి రాజేందర్ పటేల్…
మల్లాపూర్ (జనంసాక్షి) జులై :17
మండలంlలోని పాత దామరాజు పల్లి గ్రామానికి చెందిన సుతారి రాజేందర్ వివిధ సమాజిక సేవ రంగంలో తెలుగు వెలుగు సాహితి వేదిక తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ పొలోజు రాజ్ కుమార్, వేములవాడ శాసనసభ్యులు చిన్నమనేని రమేష్ బాబు, చొప్పదండి శాసన సభ్యులు సుంకే రవి శంకర్, రాష్ట్ర ప్రభుత్వా జాతీయ పురస్కారాల గ్రహీత వాసంభూమానందం, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య, వంగాల శాంతి కృష్ణ ఆచార్య గిన్నిస్ వరల్డ్ రికార్డు గ్రహీత, నేలకొండ అరుణ జడ్పీ చైర్పర్సన్ రాజన్న సిరిసిల్ల, రామతీర్థం మాధవి చైర్పర్సన్ పురపాలక సంఘం వేములవాడ, నాగేంద్ర చారి డి.ఎస్.పి వేములవాడ, వెంపటి శ్రావణి ప్రపంచ ప్రఖ్యాత నృత్య దర్శకురాలు గిన్నిస్ వరల్డ్ రికార్డు గ్రహీత, బొడ్డు రాములు జిల్లా మహాభారత కళాకారుల సంక్షేమ సంఘం, సాయికుమార్ నాట్యాచార్యులు శ్రీశైల దేవస్థానం, జొన్న గొని యాదగిరి గౌడ్ కో చైర్మన్ తెలుగు వెలుగు సాహితి వేదిక సాహితీవేత్తలు విద్యావంతులు మేధావుల చేతులమీదుగా మహానంది జాతీయ పురస్కారాన్ని సుతారి రాజేందర్ కు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా కోరుట్ల శాసనసభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు సుతారి రాజేందర్ కు అభినందనలు తెలియజేశారు.