‘మహానటి’లో మా నాన్నను విలన్‌గా చూపించారు

– సావిత్రికి జెమిని గణెళిశన్‌ అంటే ఇష్టంలేదు
– చిత్ర బృందంపై మండిపడ్డ గణెళిశన్‌ కుమార్తె కమల
చెన్నై, మే17(జ‌నం సాక్షి ): అలనాటి నటి సావిత్రి జీవితాధారంగా తెరకెక్కించిన చిత్రం ‘మహానటి’. ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. చిన్నాపెద్దా తేడా లేకుండా ఈ చిత్రం అందరినీ మెప్పించింది. కానీ ఈ సినిమాలో తన తండ్రి జెమిని గణెళిశన్‌ పాత్రను తప్పుగా చూపించారని, సావిత్రి జీవితంలో తానే విలన్‌ అన్నట్లు చూపించారని గణెళిశన్‌ కుమార్తె కమలా సెల్వరాజ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈమె గణెళిశన్‌, అలిమేలు దంపతుల కుమార్తె. ఇటీవల ఈ సినిమా చూసిన కమల విూడియా ద్వారా చిత్ర బృందంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సినిమాలో మా నాన్న పాత్రను తప్పుగా చూపించారని, సినిమాలో జెమిని గణెళిశన్‌ అలిమేలుని కాకుండా సావిత్రినే ఎక్కువగా ప్రేమించినట్లు ఎలా చూపిస్తారు అని ప్రశ్నించారు. అలిమేలు, గణెళిశన్‌లకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, అలాంటప్పుడు అలిమేలుపై ప్రేమే లేదన్నట్లుగా చూపించడం దుర్మార్గమన్నారు. ఆ విషయం విూకెలా తెలుసని చిత్ర బృందాన్ని ప్రశ్నించారు. అదీకాకుండా
సావిత్రికి మద్యం అలవాటు చేసింది జెమిని గణెళిశనే అన్నట్లు చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సావిత్రి కష్టాల్లో ఉన్నప్పుడు పేరున్న నటులు ఆమెను పట్టించుకోలేదని చూపించారని, అది తప్పు అన్నారు. సినిమా మొత్తంలో జెమిని గణెళిశన్‌ను ప్రతినాయకుడిగా చూపించారని, కానీ అందులో ఏమాత్రం నిజంలేదన్నారు. నాకు తెలిసినంతవరకు సావిత్రికి మా నాన్న అంటే అసలు ఇష్టం లేదని, చెప్పాలంటే.. ఓ సారి మేము సావిత్రి ఇంటికి వెళ్లినప్పుడు ఆమె మా విూదకు తన పెంపుడు కుక్కల్ని వదిలారన్నారు. ఓ మనిషి జీవితం గురించి మూడు గంటల్లో ఎలా చెప్పేస్తారు అంటూ కమల ప్రశ్నించారు. కమల గైనకాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. దక్షిణాదిన 1990లో తొలి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీని సృష్టించిన వైద్యురాలు ఆమే కావడం విశేషం. 1993లో ఉత్తమ వైద్యురాలిగా అవార్డు కూడా అందుకున్నారు.