మహారాష్ట్రలో కార్చిచ్చులా క్యాన్సర్‌ బాధితులు

` హింగొలీ జిల్లాలో 13,500 మహిళల్లో వ్యాధి అనుమానిత లక్షణాలు..!
ముంబై(జనంసాక్షి):క్యాన్సర్‌ కేసులను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు మహారాష్ట్రలో నిర్వహించిన సర్వేలో ఆందోళనకర విషయం వెలుగుచూసింది.‘సంజీవని అభియాన్‌’ పేరిట హింగొలీ జిల్లాలో స్థానిక యంత్రాంగం నిర్వహించిన డ్రైవ్‌లో 13,500 మంది మహిళల్లో క్యాన్సర్‌ అనుమానిత లక్షణాలు కనిపించాయి. 7000 మందిలో సర్వైకల్‌ క్యాన్సర్‌, 3,500 మంది రొమ్ము క్యాన్సర్‌, 2000 మందిలో నోటి క్యాన్సర్‌ అనుమానిత లక్షణాలను గుర్తించినట్లు కలెక్టర్‌ అభినవ్‌ గోయల్‌ మీడియాతో వెల్లడిరచారు. మరికొందరిలో ఇతర క్యాన్సర్‌ లక్షణాలు కనిపించాయన్నారు.ఈ డ్రైవ్‌లో భాగంగా జిల్లాలోని 3.5 లక్షల మంది మహిళలపై సర్వే జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దీనిని ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం స్క్రీనింగ్‌ ముగిసిందని, తర్వాత పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. నిపుణులు, శిక్షణ పొందిన వైద్యబృందం పర్యవేక్షణలో ఈ ప్రక్రియను చేపట్టినట్లు ఆయన వెల్లడిరచారు.

తాజావార్తలు