మహారాష్ట్రలో మహా ఉధృతి` రికార్డు స్థాయిలో కేసు!

` ఒక్కరోజే 1,233 నమోదు` ముంబయిలో 10మే కరోనా బాధితు ` ధారవిలో కొత్తగా 68 కేసు

ముంబయి,మే 6(జనంసాక్షి): మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇవాళ ఒక్కరోజే 1,233 పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్కరోజులో నమోదైన కేసుతో పోల్చితే ఇదే అత్యధికం కావడం గమనార్హం. మరోవైపు గడిచిన 24 గంటల్లోనే 34 మరణాు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసు సంఖ్య 16,758కి చేరగా.. ఇప్పటివరకు 651 మంది ఈ మహమ్మారి బారినపడి ప్రాణాు కోల్పోయినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వ్లెడిరచింది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కరోనా పాజిటివ్‌ కేసు సంఖ్య 10వే మార్కు దాటింది. ఇవాళ ఒక్కరోజే కొత్తగా 769 కేసు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసు సంఖ్య 10,527కి చేరింది. తాజాగా 25 మంది మరణించారని, దీంతో మొత్తం మృతు సంఖ్య 412కి చేరిందని బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రకటించింది. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన ముంబయిలోని ధారవిలో కొత్తగా 68 పాజిటివ్‌ కేసు నమోదుకా.. ఒకరు ప్రాణాు కోల్పోయారు. దీంతో ధారవిలో మొత్తం కేసు సంఖ్య 733కి చేరగా.. మృతు సంఖ్య 21కి పెరిగింది. నవీ ముంబయిలో అప్పుడే పుట్టిన చిన్నారికి కరోనా సోకింది. ఇక్కడి కొవిడ్‌`19 ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గర్భిణి ఓ పాపకు జన్మనిచ్చింది. చిన్నారికి పరీక్షు నిర్వహించగా పాపకు కూడా కరోనా సోకినట్లు తేలింది.