మహారాష్ట్ర సాధువు హత్యకేసుతో ముస్లింకు ఎలాంటి సంబంధంలేదు

` హత్యకేసు నిందితుల్లో ఒక్క ముస్లిం కూడా లేరు
` స్పష్టం చేసిన మహారాష్ట్ర హోం శాఖ
ముంబై,ఏప్రిల్‌ 22(జనంసాక్షి): మహారాష్ట్ర పాల్‌ఘర్‌లో సాధువు హత్య కేసులో అరెస్టైన నిందితు జాబితాను ఉద్ధవ్‌ సర్కారు విడుద చేసింది. 101 మంది నిందితుల్లో ఒక్క ముస్లిం కూడా లేరని మహారాష్ట్ర హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ తెలిపారు. ఘటనపై సీఐడీ విచారణ కొనసాగుతుండగానే ప్రభుత్వం ఈ జాబితా విడుద చేసింది. సాధువు హత్య కేసులో కుట్ర దాగి ఉందని ప్రతిపక్షాు ఆరోపిస్తున్న తరుణంలో ప్రభుత్వం ఈ జాబితా విడుద చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏప్రిల్‌ 16 రాత్రి తమ గురువు అంత్యక్రియకు హాజరయ్యేందుకు వెళ్తుండగా పాల్‌ఘర్‌ గడ్చింధాలి గ్రామం వద్ద సాధువు వాహనంపై దుండగు రాళ్లు, కర్రు, రాడ్లతో దాడి చేశారు. వాహనంలో ఉన్న ఇద్దరు సాధువును, డ్రైవర్‌ను కొట్టి చంపారు. దొంగనే పుకార్లు రావడం వల్లే దుండగు దాడి చేశారని పోలీసు చెబుతున్నారు. మరణించిన సాధువును క్పవృక్ష గిరి మహరాజ్‌, సుశీల్‌ గిరి మహరాజ్‌గా గుర్తించారు. తమ సమక్షంలోనే దాడి జరుగుతున్నా పోలీసు అడ్డుకోలేకపోయారు. ఇప్పటికే ప్రభుత్వం ఇద్దరు పోలీసును సస్పెండ్‌ చేసింది.యూపీ సీఎం యోగి, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మాట్లాడటంతో ఘటనపై సీఐడీ విచారణకు ఆదేశించినట్లు ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే ప్రకటించారు.