మహార్యాలీలో పాల్గొన్న బీజేపీ నేతలను అరెస్టు చేసిన పోలీసులు

హైదరాబాద్‌,జనంసాక్షి: యూపీఏ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ ఇవాళ ‘మహార్యాలీ’ని నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. బాగ్‌లింగంపల్లి నుంచి ప్రారంభమైన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసు జులుం నశించాలంటూ నినాదాలు చేస్తూ బీజేపీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉధ్రిక్తత ఏర్పడింది. ర్యాలీలో పాల్గొన్న జాతీయనేత వెంకయ్యనాయుడుతోపాటు రాష్ట్రశాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, దత్తాత్రేయ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు.