మహాలక్ష్మి అలంకరణలో వాసవి మాత. ఆలయంలో యజ్నం, ప్రత్యేక పూజలు.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్30(జనంసాక్షి):
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో సాయి బాలాజీ సిండికేట్ ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయ ఆవరణలో నిర్వహిస్తున్న 52 వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో ఐదవ రోజు శుక్రవారం వాసవి కన్యకా పరమేశ్వరి మాతను మహాలక్ష్మి దేవి రూపంలో అలంకరించారు విశేష అలంకరణ సేవలో హకీం మురళి లక్ష్మీ కళ, మిడిదొడ్డి శ్రీనివాసులు హరిత, సూరంపల్లి రాధాకృష్ణ నాగమణి,బొడ్డు రవీంద్ర ప్రణీతాదేవి, మిడిదొడ్డి బుచ్చయ్య సూర్య కళ దంపతులు పాల్గొన్నారు. అనంతరం సామూహిక పూజా కార్య క్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు జోషి పాండురంగ శర్మ మంత్రోచ్ఛరణల మధ్య నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో ఉత్సవ కమిటీ అధ్యక్షులు మాచిపెద్ది శివకుమార్ పట్టణ ప్రజలతో పాటు ఉత్సవ నిర్వాహకులు హకీం రాజేష్,దర్శి రాజయ్య, మిడిదొడ్డి చంద్రశేఖర్,మిడిదొడ్డి రాధాకృష్ణ, బొడ్డు వెంకటరమణ,బాదం రమేష్, మాచిపెద్ధి శ్రీనివాసులు,పాలాది యాదయ్య, పోలరాజు, కొట్రా బాలాజీ,అర్థం సాయి కృష్ణ, కొండూరు సాయిరాం,కూన చంద్రమోహన్, పోల మోహన్,కందూరు బాలరాజు, బిల్లకంటి రవికుమార్,మిడిదొడ్డి చంద్రశేఖర్, చిగుళ్లపల్లి రమణ కుమార్,ఆకుతోట రాజు, అల్లంపల్లి రమేష్,నామ రాము,కండే సాయి శంకర్,పోల రాము,బాదం పరమేశ్వర్,హకీం కిషోర్,రామ్మోహన్, శ్రీనివాసులు లతోపాటు పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.