మహా ప్రమాదంగా మారింది.

24 గంటల్లో 352 కరోనా కేసుల నమోదు

ముంబయి, ఏప్రిల్ 13(జనంసాక్షి): మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య రోజురోజు కూ భారీగా పెరుగుతోంది. ఇవాళ ఒక్కరోజే కొత్తగా 352 పాజిటివ్ కేసులు నమోదయ్యా యి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,334కు చేరింది. ఇప్పటి వరకు ఈ వైరస్ కారణంగా రాష్ట్రంలో 160 మంది మరణించారని రాష్ట్ర ప్రభుత్వం వెల్ల డించింది. దేశ ఆర్థిక రాజధాని నగరమైన ముంబ యిలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కొవిడ్-19 విసిరిన పంజాకు ‘మహా’ ప్రమాదంగా మారింది విలవిలలాడుతున్న ఈ మహానగరంలో తాజాగా మరో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 100కు చేరినట్టు బృహన్ ముంబయి కార్పొరేషన్ (బీఎంసీ) వెల్లడించింది. ఈ రోజు కొత్తగా మరో 150 కేసులు నమోదు కావడంతో నగరంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,549కి చేరినట్టు తెలిపింది. అలాగే, ఈ రోజు 43మంది కోలుకోవడంతో ఇప్పటి వరకు మొత్తంగా డిశ్చార్జి అయినవారి సంఖ్య 141కి చేరినట్టు పేర్కొంది.