*మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి*

 రామన్నపేట అక్టోబర్ 23 (జనంసాక్షి)
మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని హంస ఫౌండేషన్ చైర్మన్ చెరుకు లక్ష్మి సుధాకర్  అన్నారు. మండల కేంద్రంలో హంస ఫౌండేషన్ ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన ఉచిత  కుట్టు మిషను శిక్షణ కేంద్రం లో 45 రోజుల పాటు శిక్షణ పొందిన వారి కి ఆదివారం సర్టిఫికెట్స్   హంస ఫౌండేషన్ చైర్మన్ చెరుకు లక్ష్మి అందజేశారు. అనంతరం ఆమె మాట్లడుతూ. మహిళలు స్వశక్తితో అన్ని రంగాల్లో రాణించాలని,  కుట్టు శిక్షణ ను అందరూ సద్వివినియోగం చేసుకున్నారని ఆమె తెలిపారు. హంస ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరిన్ని శిక్షణ కేంద్రం లని నెలకొల్పుతమని ప్రకటించారు.
 ఈ కార్యక్రమంలో హంస ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు యస్ కే చాంద్, హంస ఫౌండేషన్ ప్రతినిధి పోరెళ్ళ విప్లవ కుమార్,  వుడిమల్ల వెంకటేష్, దొంతరాబోయిన గణేష్ ముదిరాజ్ శిక్షణ కేంద్రం ప్రతినిధి హాంసమ్మ, శ్రీలక్ష్మి, ఉమరణి, అనిత శోభా అరుణ ముంతాజ్ బేగం మధురిమ, సుస్మిత శిక్షణ పొందిన మహిళలూ తదితరులు పాల్గొన్నారు.