మహిళలు పోషకాహారం తీసుకోవాలి
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీత రెడ్డి
నర్సాపూర్. సెప్టెంబర్, 22, ( జనం సాక్షి )
మహిళలు తప్పనిసరిగా పోషక ఆహారం తీసుకోవాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీత రెడ్డి అన్నారు.
గురువారం నర్సాపూర్ మండల పరిధిలోని కాగజ్ మద్దూర్, మూసాపేట్ గ్రామాలలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో జాతీయస్థాయి పోషకార మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత రెడ్డి హాజరై మాట్లాడారు. మహిళలు ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మహిళలు ఎక్కువ మంది రక్తహీనత వల్ల బాధపడుతున్నారని, రక్తహీనతలను అధిగమించేందుకు ప్రతిరోజు మంచి పోషకాహారం తీసుకోవాలన్నారు. ముక్యంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారులు పోషకాలు ఉన్న ఆహరం తీసుకోవాలని సూచించారు. మహిళలకు ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ హేమ భార్గవి, సూపర్వైజర్ సరళ, కాగజ్ మద్దూర్ సర్పంచ్ శివకుమార్ తదితరులు ఉన్నారు.
ఫోటో రైట్ అప్ ఎన్ ఎస్ పి 3 సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత రెడ్డి
Attachments area