మహిళల అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్
…జెడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి
స్టేషన్ ఘనపూర్ , జూలై , ( జనం సాక్షి ): తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళ లు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, మహిళల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నార ని జెడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి అన్నారు. డివిజన్ కేంద్రంలోని ఎంపీడీఓ కార్యల య సమావేశం హాల్లో స్వర్ణ విజయ మండల సమైక్య 15వ వార్షికోత్సవ మహాసభ నిర్వహించా రు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన జెడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ రవి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత,మనసున్న మహా రాజు ఎంఎల్ఏ డాక్టర్ తాటికొండ రాజయ్య మహి ళలకు ఎక్కువ ప్రాధాన్యతఇస్తు మగవారితోసమా నంగా పొదుపు ద్వారా అభివృద్ధి సాదించాలని వారిఅభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు.తెలం గాణ రాష్ట్రంలో మహిళలకు ప్రాతినిద్యం కల్పించి న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ కు దక్కుతుందని అన్నారు.ఈ సమావేశంలో ఎంపీపీ కందుల రేఖ గట్టయ్య ,ఏపిఎం కవిత, మండల సమైక్య అధ్యక్షురాలు ఎం స్రవంతి, కార్యదర్శి పి మంజుల,కోశాధికారి ఎస్ మమత, ఉపాధ్యక్షురా లు ఎం స్వప్న, సహాయ కార్యదర్శి రుక్వానా, సిసి లు రజని, ఉమారాణి, తదితరులు పాల్గొన్నారు.