మహిళల ఆర్థిక స్వావలంబనకు కృషి

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
రామేశ్వరంబండలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభం
పటాన్చెరు అక్టోబర్ 13(జనం సాక్షి)
రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబనకు సంపూర్ణ సహకారం అందిస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.
పటాన్చెరు మండల పరిధిలోని రామేశ్వరంబండ వీకర్ సెక్షన్ కాలనీలో జెకె ఫెన్నార్ పరిశ్రమ సౌజన్యంతో ఏర్పాటుచేసిన ఉచిత కుట్టు శిక్షణా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల ఆర్థిక అభ్యున్నతి కోసం ఇందిరా క్రాంతి పథకం ద్వారా రుణాలు అందించడంతోపాటు, వృత్తి శిక్షణ నైపుణ్య కేంద్రాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే మహిళల కోసం జెకె ఫెన్నార్ పరిశ్రమ యాజమాన్యం ఉచిత కుట్టు శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం పట్ల ఆయన అభినందనలు తెలిపారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ధరణి అంతిరెడ్డి,  గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు ఐకెపి ఎపిఎం శ్రీనివాస్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అంతిరెడ్డి, పరిశ్రమ ప్రతినిధులు, మహిళలు  పాల్గొన్నారు.