మహిళా బ్యాంకుకోసం ఆర్బీఐ అనుమతి కోరిన ఆర్థిక శాఖ

న్యూఢిల్లీ : రూ. 1000 కోట్ల పెట్టుబడితో మహిళా బ్యాంకును ప్రారంభించేందుకు రిజర్వు బ్యాంకు నుంచి ప్రాథమికంగా అనుమతి కోరినట్లు కేంద్ర ఆర్థిక కార్యదర్శి రాజీవ్‌ టక్రూ వెల్లడించారు. దేశంలోని ఆరు ప్రాంతాల్లో ఈ బ్యాంకు శాఖలను ఏర్పాటు చేసేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ఇవి పూర్తిగా మహిళా సిబ్బందితో పనిచేస్తాయి. రిజర్వు బ్యాంకు నుంచి పూర్తి స్థాయి అనుమతులుపొంది. ఈ ఏడాది నవంబరు నుంచి బ్యాంకులు పనిచేయడం ప్రారంభిస్తాయని ఆర్థిక మంత్రి చిదంబరం ప్రకటించారు. మహిళా బ్యాంకును ఏర్పాటు చేయనున్నట్లు పార్లమెంటుకు బడ్జెట్‌ సమర్పించే సమయంలోనే ఆర్థిక మంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే.