మహిళా సంఘం నూతన కమిటీ ఎన్నిక

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- యాచారం మండల పరిధిలోని కురుమిద్ద గ్రామంలో మహిళా సంఘం ఐద్వా నూతన కమిటీ ని మండల కార్యదర్శి మస్కు అరుణ ప్రకటించారు ఈసందర్బంగా యాచారం లో ఆమె మాట్లాడుతూ  వంట గ్యాస్ ధరలు  మరియూ  నిత్యావసర  ధరలు   అడ్డు అదుపు  లేకుండా పెంచడంతో   మహిళపైన  మోయలేని భారం పడింది కనుక వెంటనే  పెంచిన ధరలు  తగ్గించాలి . పెన్షన్ల కోసం  దరకాస్తులు చేసుకున్న  వృద్ధాప్య  వీడో ఒంటరి మహిళలు  వికలాంగులు  4 సంవత్సరాల క్రితం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికి ప్రభుత్వం  పింఛన్లు మంజూరు చేయక పోవడం  తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అలాగే  57 సంవత్సరాలు  నిండిన  వారందరికి  దరఖాస్తులు ఆహ్వానించి  వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలి.అభయ హస్తం సంబంధించింది  మహిళలు పొదుపు చేసుకున్న డబ్బులు  తిరిగి  ఇస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటికి డబ్బులు తిరిగి ఇవ్వలేదు  దీనిపై పలుమార్లు ఆందోళనలు చేసినా  చీమకుట్టినట్టు లేదు   ఇండ్లు ఇళ్ల స్థలాలు లేక  మహిళలు తీవ్రంగా  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు  కావున డబల్ బెడ్ రూమ్ ఇండ్లు  కట్టి ఇయ్యాలి ఇండ్ల స్థలాలు  లేనివారికి వెంటనే  స్థలాలు ఇవ్వాలి. డ్వాక్రా పొదుపు సంఘాల లో  పవల వడ్డీ రుణం ఎక్కడ అమలు కావడం లేదు  పాల వడ్డీ కె రుణం అమలు చెయ్యాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం
ఈ సందర్భంగా  నూతన కమిటీని ఎన్ను కోవడం జరిగింది
కార్యదర్శిగా పలమొని సావిత్రి,
అధ్యక్షులుగా మల్కాపురం బాలమ్మ,
ఉపాధ్యక్షులు గా జయమ్మ,
సహాయ కార్యదర్శిగా పూజ,   బాలమ్మ,  పద్మమ్మ, మరో 20 మందితో  కమిటీ ఎన్ని కైంది ఈ కార్యక్రమం లో సంఘం సభ్యులు రాజమ్మ అరుణ  యాదమ్మ  వెంకటమ్మ  అండాలు భాగ్యమ్మ   మనీషా  మౌనిక  తరులు పాల్గొన్నారు