మహిళా సంఘాలు సకాలంలో రుణాలు చెల్లించాలి
జిల్లా ఏ పి డి మురళి కృష్ణ
నాగిరెడ్డిపేట్: 18 అక్టోబర్ జనం సాక్షి -బ్యాంక్ లింకేజీ,స్త్రీనిధి ద్వారా తీసుకున్న రుణాలను మహిళా సంఘాల సభ్యులు సకాలంలో సక్రమంగా చెల్లించాలని జిల్లా ఏపిడి మురళి కృష్ణ అన్నారు.మంగళవారం మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో ఐకెపి వివోఏలు,సీసీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఏపిడి మురళి కృష్ణ మాట్లాడుతూ నాగిరెడ్డిపేట మండలంలో మహిళా సంఘాల సభ్యులు బ్యాంకు లింకేజీ,శ్రీనిధి ద్వారా తీసుకున్న రుణాల బకాయిలు లక్షల్లో పేరుకపోతున్నాయని మహిళా సంఘాల సభ్యులు సకాలంలో వారు తీసుకున్న రుణాలు చెల్లించేలా ఐకెపి సీసీలు,వివోఏలు అవగాహన కల్పించి రుణాలు చెల్లించేలా చర్యలు చేపట్టాలన్నారు.అనంతరం ఏపీడీ మురళీకృష్ణ విలేకర్లతో మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో బ్యాంకు లింకేజీ ద్వారా 701 కోట్లు రుణాలు ఇవ్వడం లక్ష్యంకాగా 460 కోట్ల రుణాలు ఇప్పటివరకు ఇవ్వడం జరిగిందని అన్నారు.4.13% మహిళా సంఘాల సభ్యులు రుణాలు చెల్లించాల్సి ఉందన్నారు.అలాగే శ్రీనిధి ద్వారా 124 కోట్ల రుణాల పంపిణీ లక్ష్యంకాగా 37 కోట్లను రుణాలు ఇవ్వడం జరిగిందన్నారు.మండలంలో 33 కోట్ల 79 లక్షల బ్యాంకు లింకేజీ,6 కోట్ల 97 లక్షల శ్రీనిధి రుణాలు పంపిణీ లక్ష్యంకాగా 19 కోట్ల 52 లక్షల బ్యాంకు లింకేజీ రుణాలు,ఒక కోటి మూడు లక్షల శ్రీనిధి రుణాలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.44 లక్షల రుణాలు 28 మహిళా సంఘాల సభ్యులు చెల్లించాల్సి ఉందన్నారు.ఈ కార్యక్రమంలో డిపిఎం సుధాకర్,ఏపీఎం జగదీష్ కుమార్,యూనియన్ బ్యాంక్ మేనేజర్ కుమారస్వామి,మండల మహిళా సంఘం అధ్యక్షురాలు సునంద,సీసీలు వివోలు తదితరులు పాల్గొన్నారు.