మహిళ ఒంటిపై నుంచి బంగారం అపహరణ
కుత్బూల్లాపూర్ : పనికల్పిస్తానని ఓ మహిళను మోసం చేసి అమె వద్ద నుంచి గుర్తుతెలియని వ్యక్తి బంగారం అపహరించుకోని పోయాడు. కూలిపని కోసం అడ్డమీద నిలుచున్న లక్ష్మి అనే మహిళకు పని ఇప్పిస్తామని గుర్తుతెలియని వ్యక్తి మోటారు వాహనంపై జీడి మెట్లలోని పారిశ్రామిక వాడకు తీసుకెళ్లాడు. అమె దగ్గర ఉన్న తులం బంగారు నగలు, 5 వేల రూపాయల నగదును దోచుకున్నారు. బాదితురాలి ఫిర్యాదుమేరకు జీడిమెట్ల పోలిసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు.