మహేందర్‌రెడ్డి గెలుపుఖాయం

సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్‌ నాయకులు

 

ఎల్లారెడ్డిపేట నవంబర్‌ 11 (జనంసాక్షి) సిరిసిల్ల శాసనసభ నియోజక వర్గంలో ప్రజలు కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి కేకే మహేందర్‌రెడ్డిని ప్రతి గ్రామలో ఆదరిస్తూ స్వఛ్ఛందంగా ముందుకు వస్తూ కాంగ్రెస్‌ను గెలిపిస్తామని స్పష్టం చేస్తున్నారని ఈ ఎన్నికల్లో మహేందర్‌రెడ్డి గెలుపు ఖాయమని ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్‌కమిటి అద్యక్షుడు దొమ్మాటి నర్సయ్య అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల తిమ్మాపూర్‌ గ్రామంలో ఆదివారం కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా నర్సయ్య మాట్లాడుతూ ప్రతి గ్రామంలో కాంగ్రెస్‌పార్టీ మెనిఫెస్టో చూసి ప్రజలు సంబరపడుతున్నారని అన్నారు. అన్ని గ్రామాలలో ప్రజలు చేతిగుర్తుకు ఓటువేసి కేకే మహేందర్‌రెడ్డి అత్యదికమెజార్టీతో గెలిపిస్తామని హమీ ఇస్తున్నారన్నారు. ఇంటింటికి తిరిగి కాంగ్రెస్‌పార్టీ కరపత్రాలను ఇచ్చి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అద్యక్షుడు లింగమూర్తి కరికె శ్రీనివాస్‌, వరద బాబు, దండు శ్రీనివాస్‌, బీమరి అంజయ్య, కొండ జనార్థన్‌గౌడ్‌, జిల్లా ప్రదాన కార్యదర్శి బండారి బాల్‌రెడ్డి, జిల్లా ఉపాద్యక్షుడు షేక్‌ గౌస్‌, జిల్లా అదికార ప్రతినిది బుగ్గ కృష్ణమూర్తి, పందిర్ల నారాయణగౌడ్‌, లింగాగౌడ్‌, సుడిది రాజేందర్‌, బానోతు రాజునాయక్‌, మానుక నాగరాజుయాదవ్‌, జజ్జెరి శ్రీనివాస్‌, వెంకట్‌రెడ్డి, గిరిదర్‌రెడ్డి,నేవూరి శ్రీనివాస్‌రెడ్డి, తాటిపెల్లి సురేష్‌రెడ్డిలు పాల్గొన్నారు.