మహేంద్రుని మాయాజాలం

 

ఐపీఎల్‌-6లో ఎక్కువగా ఇష్టపడే వ్యక్తిగా ధోనీ

చెన్నై,ఏప్రిల్‌ 25 (జనంసాక్షి): ప్రపంచ క్రికెట్‌లో అతి కొద్దిసమయంలో అత్యున్నత స్థాయికి ఎదిగిన క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ…ఆటలోనే కాదు ఆర్జనలోనూ , పాపులారిటీలోనూ దిగ్గజాలతో పోటీపడగలిగిన సత్తా ఉన్నవాడు. ఇప్పటికే పలు రూపాలలో ఇది నిరూపితమైంది కూడా. తాజాగా ఐపీఎల్‌ ఆరో సీజన్‌లో ఎక్కువమంది కోరుకునే ఆటగాడి జాబితాలో కూడా ధోనీదే అగ్రస్థానం. ప్రముఖ వెబ్‌సైట్‌ షాదీ డాట్‌కామ్‌ నిర్వహించిన సర్వేలో ఈ ఆసక్తికర విషయం వెల్లడైంది. లీగ్‌లో చాలా మంది స్టార్‌ క్రికెటర్లు ఆడుతున్నప్పటకీ… ధోనీ ఆడితేనే తమకు ఇష్టమని అభిమానులు చెప్పారు. ఈ సర్వే కేవలం మహిళా అభిమానుల కోసం నిర్వహించారు. ఓటింగ్‌లో ఏకంగా 61.1 శాతం మంది మహిళాభిమానులు ధోనీనే కోరుకోవడం విశేషం. అతనికి పెళ్ళైనా వారి అభిమానం ఎంత మాత్రం తగ్గలేదు. ఈ సర్వేలో సచిన్‌ టెండూల్కర్‌కు 39 శాతం ఓట్లు వచ్చాయి. విదేశీ క్రికెటర్ల జాబితాలో బ్రెట్‌లీకి మంచి ఫాలోయింగ్‌ ఉన్నట్టు అర్థమవుతోంది. ఇక మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌గా విరాట్‌ కోహ్లీ ఎంపికయ్యాడు. ఓటింగ్‌లో కోహ్లీకి 53.22 శాతం ఓట్లు దక్కాయి. అమ్మాయిల అభిమానం పొందడంలో కోహ్లీ తర్వాతే యువరాజ్‌సింగ్‌ ఉండడం విశేషం. యువీకి 28.32 శాతం మంది ఓటేయగా… సురేష్‌రైనా 16.21 శాతంతో మూడో స్థానంలో నిలిచాడు. కాగా మహిళా అభిమానులు ఎక్కువగా ఇష్టపడే జంటల జాబితాలో కూడా ధోనీనే నిలిచాడు. ధోనీ , సాక్షి పెయిర్‌కు 71.39 శాతం మంది ఓటింగ్‌ దక్కింది. తర్వాత స్థానంలో సచిన్‌ , అంజలి జంటకు 68.45 శాతం ఓట్లు లభించాయి.
అభిమానుల రారాజు ధోని
ఢిల్లీ : మహేంద్రసింగ్‌ ధోని ఉత్తరఖండ్‌ ఆల్మోరా పర్వాత సానువుల్లో జీవించిన తన కొండజాతి పూర్వీకుల జన్యు లక్షణాలను పుణికి పుచ్చుకున్న ఈ టీంమిండియా కెప్టెన్‌న ఇప్పుడు భారత్‌లో అతివలు మెచ్చె పురుషిడిగా అవతరించాడు. ఇంటర్నెట్‌లో ప్రముఖ వివాహ సంబందాల వేదిక షాదీ డాట్‌ కామ్‌ బెబ్‌ సైట్‌ నిర్వహించాన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. దృడమైన శరీంరంతో పాటు ఒత్తిడిని తట్టుకునే నిబ్బరం కలిగి ఉండే ధోనికి అమ్మాయిలు అత్యదిక మంది ఓటేశారట. ఐపీఎల్‌ ఆరవ సీజన్‌ సందర్భంగా షాదీ డాట్‌ కామ్‌ ఈ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో ధోనికి 61 శాతం ఓట్టువచ్చాయి, బర్త్‌ డే బాయ్‌ సచిన్‌కు 39 శాతం ఓట్లే వచ్చాయట.