మహేంద్ర వారి సరికొత్త వాహనం
శ్రీకాకుళం, జూలై 25: మహేంద్ర ఆటో మొబైల్స్ సంస్థ నూతనంగా ప్రవేశ పెట్టిన రోడియో ఆర్‌జెడ్ వాహనాన్ని సంస్థ ప్రాంతీయ సర్వీసు మేనేజర్ సజిత్ ఆరవింద్ ఆక్షన్,,, స్థానికంగా బుధవారం నాడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి యువతరం కోరుకునే లక్ష్యణాలతో ఆకర్షనీయమైన రంగులలో రోడియో ఆర్‌జెడ్ వాహనాన్ని తీసుకు వచ్చామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక శ్రీనివాస ఆటో ఏజెన్సిస్ అధినేత బి.వి.రమణమూర్తి, ఆయన సతీమణి విజయలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేశారు. తొలి వాహనాన్ని జిల్లాలోని పలాసకు చెందిన సూరిబాబు అనే వ్యక్తికి విక్రయించారు. అనంతరం పట్టణ మెకానికల్‌ల సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీలర్ శ్రీనివాసరావు, సర్వీసు ఇంజనీర్ భవానీ ప్రసాద్, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.