మాజీ ఎంపీ ధర్మబిక్షం గౌడ్‌కు నివాళులు
అబ్దుల్లాపూర్ మెట్: స్వాతంత్ర సమరయోధుడు, మాజీ ఎంపీ బొమ్మగోని ధర్మబిక్షం గౌడ్ రెండో వర్థంతిని పురస్కరించుకుని అబ్దుల్లాపూర్ మెట్‌లో ఆయన విగ్రహానికి రాజ్యసభ సభ్యులు దేవేందర్‌గౌడ్, మాజీ ఎంపీ అజీజ్ పాషా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ధర్మబిక్షం సేవలను వారు కొనియాడారు. కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నేతలతో పాటు మండల గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.