మాజీ ఎమ్మెల్యే కిష్టన్న సేవలు మరువలేనివి…

– వైస్ ఎంపీపీ సత్తి అరుణ్ కుమార్ రెడ్డి.
ఊరుకొండ, ఆగస్టు 18 (జనం సాక్షి):
కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు యడ్మ కృష్ణారెడ్డి రైతుల పక్షాన నిలిచి విద్యుత్ సమస్యపై అలుపెరుగని పోరాటం చేసి కల్వకుర్తి నియోజకవర్గంలో కరెంట్ సమస్య తీర్చి కరెంట్ కిష్టన్నగా ప్రజలకు ఎనలేని సేవలు అందించాలని వైస్ ఎంపీపీ అరుణ్ కుమార్ రెడ్డి, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు వీరారెడ్డి, మండల రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు మన్నెం రవీందర్ రెడ్డిలు అన్నారు. గురువారం ఊరుకొండ మండల కేంద్రంలోని కల్వకుర్తి – జడ్చర్ల ప్రధాన రహదారిపై మాజీ ఎమ్మెల్యే యడ్మ కృష్ణారెడ్డి రెండవ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో గుండ్లగుంటపల్లి సర్పంచ్ ఆంజనేయులు, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గిరి నాయక్, శ్రీనివాసులు, రమేష్, బక్క జంగయ్య, రాజేష్, లక్ష్మణ్, వేముల రాములు, లాలు, టిఆర్ఎస్ మండల నాయకులు, కార్యకర్తలు, కిష్టన్న అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.