మాజీ ప్రధాని రాజీవ్ ది చెరగని ముద్ర
బత్తుల శ్రీనివాస్
డోర్నకల్ ఆగస్ట్ 20 జనం సాక్షి
భారత దేశ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 78వ జయంతి పురస్కరించుకొని శనివారం మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు జెండా ఎగరవేసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించాయి.
ఈ సందర్భంగా మండలాధ్యక్షుడు బత్తుల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాలనుసారం
నియోజకవర్గ నేత రామచందర్ నాయక్ సూచనల మేరకు మండల వ్యాప్తంగా గ్రామ గ్రామాన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు జరుపుకుంటున్నట్లు తెలిపారు.అనూహ్య పరిస్థితుల్లో ప్రధానిగా పదవి చేపట్టిన రాజీవ్ గాంధీ దేశ చరిత్రలో చెరగని ముద్ర వేశారని అన్నారు.ప్రపంచంలో భారత్ అగ్రగామిగా ఉండాలనే ఆకాంక్షతో దేశాభివృద్ధికి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టిన ఘనత ఆయనదని కొనియాడారు.ఆయన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని దేశంలో తీసుకొచ్చి అభివృద్ధి చేశారని తెలిపారు.దేశంలో అతి చిన్న వయసులోనే ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా నిలిచారని అన్నారు.కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భీమా నాయక్,దోమల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.