మాట్లాడితే జైలుకు పంపుతారా?
– ముఖ్యమంత్రి బెదిరింపులు సరికాదు
– మహాఒప్పందం తెలంగాణ ప్రయోజనాలకు భంగం
– జస్టిస్ చంద్రకుమార్
హైదరాబాద్,ఆగస్టు 25(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రప్రభుత్వం మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందాలపై విపక్షనేతలు మాట్లాడినంతమాత్రాన వారికి జైలుకు పుంపతామని ముఖ్యమంత్రి అనడం సరికాదని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ హితవు పలికారు. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ రైతు సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో అఖిలపక్ష రాజకీయ పార్టీల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ మహారాష్ట్ర సర్కారు విధించిన షరతులకు లొంగిన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని తీవ్రంగా తప్పుబట్టారు. ఆయన హాజరయ్యారు.సాగునీటి రంగ నిపుణుల కమిటీ సూచనలను బేఖాతరు చేసి ప్రాజెక్టుల నిర్మాణాలకు ముఖ్యమంత్రి పూనుకుంటున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపించారు. సాగునీటి రంగ నిపుణులు, న్యాయస్థానం, పార్లమెంటుపై కేసీఆర్‌కు నమ్మకం లేదని ధ్వజమెత్తారు. సాగునీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్రతో కుదిరిన ఒప్పందం తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఉందని అఖిలపక్ష రాజకీయ నేతలు ఆక్షేపించిన విషయం తెలిసిందే.