మాదక ద్రవ్యాలకు బానిసైతే జీవితాలే సర్వనాశనం… ఎస్సై బి రాంబాబు.

నాగార్జునసాగర్ (నందికొండ), జనం సాక్షి,సెప్టెంబర్23; మాదక ద్రవ్యాల వినియోగం,దానివల్ల కలిగే దుష్ప్రభావాలు,దుష్ఫలితాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని నాగార్జునసాగర్ విజయపురి నార్త్ సబ్ ఇన్స్పెక్టర్ బి రాంబాబు
కోరారు. మాదక ద్రవ్యాల నిర్మూలన, దుష్ప్రభావాలు అనే అంశంపై అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన స్థానిక  ప్రభుత్వ జూనియర్ కాలేజి విద్యార్థిని విద్యార్దులకు సైబర్ నేరాల పట్ల,మైనర్ డ్రైవ్,టీజింగ్,మరియు మాదకద్రవ్యాల(గంజాయి,గుట్క,సిగరెట్,మద్యం) సేవించటం వలన జరిగే అనర్ధాల గురించి వివరించారు. మాదకద్రవ్యాల వినియోగం యువతలో,విద్యార్థుల్లో అధికంగా ఉందన్నారు.విద్యార్థులు మాదక ద్రవ్యాలకు,మద్యపానానికి దూరంగా ఉండాలని వాటికి బానిసగా మారితే జీవితం నాశనమవుతుందన్నారు.వీటి నిరోధానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇచ్చేందుకు విద్యాసంస్థలు,స్వచ్ఛంద సంస్థలు తమ వంతు సహకారం అందించాలని కోరారు.విద్యార్థులు మాదకద్రవ్యాల పట్ల ఆకర్షితులు కాకుండా చూసేందుకు ప్రభుత్వం అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.అనంతరం దీనిపై విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు తగురీతిలో సమాధానం ఇచ్చారు.
యువత విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకొని, ప్రణాళికబద్దంగా చదువు మీద శ్రద్ధ  పెట్టి, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడముతో పాటు సమాజానికి మేలు చేయాలని పిలుపునిచ్చారు. తదనంతరం కళాశాల సిబ్బంది శ్యాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమానికి కళాశాల సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.