మానవఅక్రమ రవాణా, సైబర్ నేరాలపై అంగన్వాడీ టీచర్ లకు అవగాహన సదస్సు
వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 17(జనం సాక్షి)
మానవ అక్రమ రవాణా, సైబర్ నేరాలపై సోమవారము 40వ డివిజన్ సి ఆర్ సి బిల్డింగ్ ఉరుసు కరీమాబాద్ వరంగల్ నందు ప్రజ్వల సంస్థ మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడి టీచర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ సునీత కృష్ణన్ మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి దివ్య దేవరాజన్ గారి ఆదేశాల మేరకు ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది .
అంగన్వాడి టీచర్లు వారి పరిధిలోని బాల బాలికలు ,మహిళలు ప్రేమ, పెళ్లి ఉద్యోగం సినిమాలో ఛాన్స్ అనే అవకాశాల పేరుతో మాయమాటలు చెప్పే వారిని గమనిస్తూ ఉండాలని తెలిపారు. ఇట్టి వారు శ్రమదోపిడి అవయవాల మార్పిడి లైంగిక దోపిడికి గురి అవ్వటం చాలా హృదయవిదారకమైన విషయము .
ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ ప్రోగ్రామ్ సీనియర్ కోఆర్డినేటర్ చంద్రయ్య అసిస్టెంట్ కోఆర్డినేటర్ సంధ్య ఐసిడిఎస వరంగల్ ప్రాజెక్ట్ సిడిపిఓ విశ్వజ, సూపర్వైజర్లు స్వరూప, బత్తిని రమాదేవి , సుజన, ఎం మల్లేశం ఎస్సై ఆంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ వరంగల్, ఎండి సము దిన్ హెడ్ కానిస్టేబుల్, సఖి అడ్మిన్ శ్రీలత ఉర్సు, కరీమాబాద్ ,శివనగర్ సెక్టార్ ల అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.