మానవ కంప్యూటర్‌ శకుంతల ఇకలేరు

బెంగళూర్‌, (జనంసాక్షి) :
కంప్యూటర్‌ కన్నా వేగంగా లెక్కలు చేసే గణిత మేధావి శకుంతలాదేవి ఆదివారం కన్నుమూశారు. ఆమె వయసు 83 సంవత్సరాలు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధ పడుతున్నారు. బెంగళూర్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. సుప్రసిద్ధ మేథమెటీషియన్‌గా ప్రపంచ ఖ్యాతిగాంచిన శంకుతలాదేవి కంప్యూటర్‌కన్నా వేగంగా లెక్కలు చేసేవారు. ఎలాంటి ప్రశ్నలకైనా సెకన్ల వ్యవధిలో సమాధానమిచ్చేవారు. ఆమె గణితశాస్త్రంలో పలు పరిశోధన గ్రంథాలు వెలువరించారు. కళాశాల విద్యార్థులకోసం పలు పుస్తకాలు రాశారు. కంప్యూటర్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆమె గణితశాస్త్ర పరిజ్ఞానాన్ని చూసి అబ్బురపడ్డాయి. ఆమె వేళ్లపై లెక్కలు చెప్పే తీరు చూసి పలువురు గణిత, భౌతికశాస్త్రవేత్తలు ఆమెకు అభిమానులుగా మారారు. కంప్యూటర్‌కు పాత్‌ ఇచ్చేకంటే వేగంగా ఆమె బదులిచ్చేవారు. ఆమెను హ్యూమన్‌ కంప్యూటర్‌గా కీర్తిస్తారు. ఆమె మృతిపై పలువురు సంతాపం వెలుబుచ్చారు.