మానవ మనుగడకు మొక్కలే ప్రాణాధారం
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):మానవ మనుగడకు మొక్కలే ప్రాణాధారమని మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు.ఆదివారం
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని మూడవ వార్డ్ బీబీగూడెంలో శ్రీరుద్ర డెవలపర్స్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న విపుల ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్ వారి ఈస్ట్ సిటీలో వన మహోత్సవ కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 75ఏళ్ల స్వాతంత్ర భారతంలో మహిళలు స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని గడుపుతూ ప్రజాసేవలో అగ్రభాగంలో నిలిచారని అన్నారు.తెలంగాణలో సిఎం కెసిఆర్, మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో మహిళలకు 50 శాతం పదవులు లభించాయని అన్నారు.మున్సిపాలిటీ పరిధిలోని పలు టౌన్ షిప్ లలో ప్రకృతి వనాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మున్సిపల్ కమిషనర్ బైరెడ్డి సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాల ప్రకారం స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు, మహిళా స్వయం సహాయక బృందాల భాగస్వామ్యంతో ప్రతిరోజు పలు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమం ద్వారా ప్రజలలో దేశభక్తి, దేశం పట్ల ప్రేమ, రేపటి భావి పౌరుల భవిష్యత్తుకు దృఢమైన రూపకల్పనకు , దేశం కోసం ప్రాణాలకు ఇచ్చిన జాతీయ నాయకుల చరిత్రను తెలియజేయడం వంటి కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు రవి నాయక్, జ్యోతి శ్రీవిద్య కరుణాకర్, చింతలపాటి భరత్ మహాజన్,ఈఈ జీకేడి ప్రసాద్, డిఈ సత్యారావు,శ్రవణ్ కుమార్, మెప్మా జిల్లా అధికారి రమేష్ నాయక్, గౌసుద్దిన్, అజీమ్ , ఏఈలు నరేందర్, రాజిరెడ్డి,ఎస్ఎస్ఆర్ ప్రసాద్, మనోజ్ కుమార్, హెల్త్ అసిస్టెంట్ సురేష్, వసుంధర, ఎడిఎంసి రేణుక, టీఎంసీ శ్వేత, మెప్మా కమ్యూనిటీ ఆర్గనైజర్లు రోజా, సువర్ణ, ఉమారాణి, పాపమ్మ మున్సిపల్ రెవిన్యూ సిబ్బంది, మెప్మా రిసోర్స్ పర్సన్లు తదితరులు పాల్గొన్నారు.