మానసికస్థితి బాగోలేక గృహిణి బలవన్మరణం
అబ్దుల్లాపూర్: హయత్‌నగర్ మండలం బాటసింగారం గ్రామానికి చెందిన దేశ ధనమ్మ (28) శనివారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. రాత్రంతా వెతికినా ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. కాగా ఆదివారం ఉదయం గ్రామ సమీపంలోని బావిలోఆమె శవాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. విచారణ జరిపి ఆమె మానసికస్థితి బాగోలేక ఈ ఘటనకు పాల్పడినట్లు తెలిపారు.