మాన్యవర్ కాన్షీరామ్ వర్ధంతిని జరుపుకున్న బీఎస్పీ నాయకులు

టేకులపల్లి, అక్టోబర్ 9( జనం సాక్షి ): టేకులపల్లి మండలంలోని మద్రాస్ తండా గ్రామపంచాయతీలో మన్యవర్ కాన్షీరామ్ గారి వర్ధంతిని ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాన్సిరాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా బీఎస్పీ నాయకులు నివాళులర్పించారు . ఈ సందర్భంగా బీఎస్పీ ఇల్లందు నియోజకవర్గ అధ్యక్షులు బాదావత్ ప్రతాప్ మాట్లాడుతూ కాన్షిరాం బహుజన కులాల ఉద్యోగులు సహకారంతో బహుజన సమాజం నిర్మాణం కోసం 1971 లో బి ఏ ఎం సి ఈ ఎఫ్, దళితుల కోసం డి ఎస్-4 1981లో స్థాపించారు. వీటితో రాజకీయ లక్ష్యాలు, అధికారం సాధించలేమని 1984లో బి ఎస్ పి పార్టీని ఏనుగు గుర్తుతో స్థాపించారు.
బహుజన కులాల హక్కులు, రాజకీయ అధికారం, అంబెడ్కర్ గారి ఆశయాల కోసం కుటుంబాన్ని , స్వయంగా వివాహాన్ని త్యజించి జీవితాంతం పోరాటం చేసిన మహనీయుడని అన్నారు .మరుగున పడిన బహుజన నాయకుల చరిత్రను వెలికి తీసి బహుజనుల రాతను తిరగరాసే ప్రయత్నం చేసిన ఏకైక నాయకుడు. పూలే,సాహుజీ, పెరియార్,ఝల్కరీ భాయి,రమాభాయి వంటి ఎంతోమంది బహుజన మహానీయుల చరిత్రను వెలుగులోకి తెచ్చారని గుర్తు చేశారు. ఆ రోజుల్లో పెరియార్ మేళా పెడితే మద్దతు ఉపసంహరణ చేసుకుంటామని బిజెపి పార్టీ బెదిరించినా జంకకుండా పెరియార్ మేళా పెట్టించారు. దానితో ప్రభుత్వం కూలిపోయినా భయపడని మహా శక్తిశాలి అన్నారు.

ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో అవి మావే
జో జమీన్ సర్కార్ కా హై వహ్ అప్నా హై
అని నినదించి 85 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకు, వెనుకబడిన కులాలకు పంచిపెట్టిన ఏకైక నాయకుడు కాన్సీ రామన్నారు. మహిళల సాధికారత కోసం అహర్నిశలు శ్రమించిన మహావీరుడు. ముఖ్యమంత్రిగా తాను ఉండే కంటే ఒక మహిళ ఉండటం దళిత బహుజన మహిళాలోకానికి ఒక గౌరవమని కుమారి మాయావతిని ముఖ్యమంత్రి గా నియమించటంతోపాటు ఎన్నో ప్ర