మాన్‌జీ దు:ఖంపై చలించిన బహ్రెయిన్‌ ప్రధాని

3
దుబాయి,ఆగస్టు 29(జనంసాక్షి):భుజాన భార్య మృతదేహాన్ని మోస్తూ, కూతురితో కలిసి 10 కిలోవిూటర్లు నడిచిన భర్త ఘటన యావత్‌ భారతాన్ని కలిచివేసింది. ఓ పేద వ్యక్తి నిస్సహాయ స్థితికి అద్దం పట్టిన ఆ ఘటన చూసి బహ్రెయిన్‌ ప్రధాని సైతం చలించిపోయారు. ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చారు.విూడియాలో ప్రసారమైన ఆ ఘటన చూసి బహ్రెయిన్‌ ప్రధాని ఖలీఫా బిన్‌ సల్మాన్‌ అల్‌ ఖలీఫా విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుని, వారికి ఆర్థిక సాయం చేస్తామని ప్రధాని ఖలీఫా ప్రకటించినట్లు బహ్రెయిన్‌లోని భారత ఎంబసీ తెలిపింది. అయితే ఎంత సాయం అందిస్తారు, ఎప్పుడిస్తారన్న దానిపై తమకింకా సమాచారం రాలేదని పేర్కొంది. ఆ మొత్తాన్ని దిల్లీలోని బహ్రెయిన్‌ ఎంబసీ ద్వారా అందిస్తారు.aఅంబులెన్స్‌ సదుపాయం లేకపోవడంతో ఒడిశాలోని కలహండి జిల్లాకు చెందిన దన మాంజీ.. తన భార్య మృతదేహాన్ని భుజాన వేసుకుని 10 కిలోవిూటర్లు కాలినడకన తీసుకెళ్లిన వార్త, ఫొటోలను చూసి యావత్‌ దేశంగ్భ్భ్రాంతికి గురైన విషయం తెలిసిందే.