మారణ ¬మానికి ఐదేళ్లు..

న్యూఢిల్లీ/ముంబై, నవంబర్‌ 21 :మరో ఐదు రోజులైతే.. ముంబై మారణ ¬మానికి నాలుగేళ్లు. 166 మంది అసువులు బాసిన ఆనాటి ఉగ్రదాడిని తలచుకుంటే.. ముంబై వాసుల్లో భయాందోళన మొదలవుతుంది. ఆ నాటి ఉగ్రదాడిని భద్రతా బలగాలు వీరోచితంగా పోరాడి ముష్కరులను ముట్టబెట్టారు. తొమ్మిది మందిని కాల్చి చంపి, కసబ్‌ను సజీవంగా పట్టుకున్నారు. దేశంపై దండెత్తిన కసబ్‌కు నాలుగేళ్ల అనంతరం గట్టి బుద్ది చెప్పారు. న్యాయస్థానం విధించిన ఉరిశిక్షను బుధవారం ఉదయం అమలు చేశారు. ఈ నేపథ్యంలో ముంబైపై దాడి.. కసబ్‌ విచారణ, ఉరిశిక్ష అమలు వరకు జరిగిన పరిణామాలను ఒకసారి పరికిస్తే..కరాచీ నుంచి సముద్రం ద్వారా ముంబైలోకి చొరబడ్డ పది మంది ఉగ్రవాదులు రద్దీ ప్రాంతాలపై దాడులకు పాల్పడ్డారు. 2008 నవంబర్‌ 26న కసబ్‌తో సహా మరో తొమ్మిది ముష్కరులు భారత ఆర్థిక రాజధాని ముంబైలో మారణ¬మం సృష్టించారు. సాయంత్రం సమయంలో ముంబైలో అడుగు పెట్టిన ఉగ్రవాదులు విచక్షణ రహితంగా దాడులకు దిగారు. ముందుగానే వేసుకున్న ప్రణాళిక ప్రకారం పలు ప్రాంతాల్లో మారణ¬మం సృష్టించారు. తాజ్‌ ¬టల్‌, ట్రైడెంట్‌, నారీమన్‌ హౌస్‌తో పాటు ముంబై రైల్వేస్టేషన్‌లో విచ్చలవిడిగా కాల్పులకు తెగబడ్డారు. 166 మందిని పొట్టన బెట్టుకున్నారు. వారి దాడుల్లో వందల మంది అమాయకులు, పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. కోట్లలో ఆస్తి నష్టం జరిగింది. మహారాష్ట్ర ఏటీఎస్‌ చీఫ్‌తో పోలీసు ఉన్నతాధికారులు హేమంత్‌ కర్కరే, విజయ్‌ సలాస్కర్‌, కాంమ్టే తదితరులు కూడా దుర్మరణం చెందారు. రంగంలోకి దిగిన భద్రతా బలగాలు, ఎన్‌ఎస్‌జీ కమాండోలు మూడ్రోజుల పాటు వీరోచితంగా పోరాడి తొమ్మిది మందిని కాల్చి చంపాయి. కసబ్‌ ఒక్కడే పోలీసు కాల్పుల్లో తీవ్రంగా గాయపడి సజీవంగా పట్టుబడ్డాడు.