మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా విధులు నిర్వహించాలి.
డిజిపి మహేందర్ రెడ్డి.
సిరిసిల్ల. అక్టోబర్ 14 (జనం సాక్షి). మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా పోలీసు అధికారులు తమ విధులను నిర్వహించాలని డిజిపి మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ లో పోలీస్ శాఖ నూతనంగా రూపొందించిన సిసి టిఎన్ఎస్ నూతన వర్షం 2.0 ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ నూతన వెర్షన్ వాడటం వల్ల ఎంతో ఉపయోగ ఉంటుందని అన్నారు. స్టేషన్లో ఉన్న ప్రతి ఒక్కరు టెక్నాలజీని నేర్చుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 1080 పోలీస్స్టేషన్ల లో ఈ విధానం అమలు చేయనున్నట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో ఎస్పీ రాహుల్ హెగ్డే, అదరపు ఎస్పీ చంద్రయ్య, డి సి ఆర్ బి సిఐ నవీన్ కుమార్, సీఐ వెంకటేష్, డిసిఆర్బి సిబ్బంది, సిసి టిఎన్ఎస్ సిబ్బంది పాల్గొన్నారు