మార్కెట్‌ వ్యాపారులతో అధికారుల చర్చలు

అనంతపురం,ఆగస్ట్‌29(జ‌నం సాక్షి): మార్కెట్‌ వ్యాపారస్తులు చేపట్టిన ఆందోళనకు స్పందించి బుధవారం అధికారులు స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో వ్యాపారస్తులతో సమావేశమయ్యారు. గత శనివారం నుంచి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ… మార్కెట్‌ వ్యాపారస్తులు కూరగాయల మార్కెట్‌ను బంద్‌ చేసి ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు స్పందించక పోయినప్పటికీ అధికారులు స్పందించడంపై వ్యాపారస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఆర్డిఓ ఓబులేసు, మున్సిపల్‌ కమిషనర్‌ భాగ్యలక్ష్మి , తహశీల్దార్‌ విశ్వనాథ్‌ లు మార్కెట్‌ వ్యాపారస్తులతో చర్చించారు. మార్కెట్‌ వ్యాపారుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని అధికారులు హావిూ ఇవ్వడంతో బంద్‌ను విరమిస్తున్నట్లు మార్కెట్‌ అసోసియేషన్‌ నాయకులు జాన్‌బాషా, షానవాజ్‌ , లక్ష్మీనారాయణలు పేర్కొన్నారు.

 

తాజావార్తలు