మార్చి 15లోగా కుల గణన పూర్తి చేయండి
హైదరాబాద్ జనంసాక్షి: మార్చి 15 లోగా కుల గణన పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉండటంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్ణయించిన తేదీలోగా కుల గణన పూర్తి చేయకుంటే ఇండ్ల నిర్మాణం, సామాజిక పింఛన్లకు కేంద్రం ఇచ్చే నిధులను నిలిపివేస్తామని హెచ్చరించింది.