మార్చి 31వ తేదీ వరకు రైళ్లు బంద్‌

ఢిల్లీ: కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో రైల్వే శాఖ ప్యాసింజర్‌ సర్వీసులను పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించుకుంది. ఇప్పటి వరకు రైద్దెన రైళ్లన్నింటిని మార్చి 31వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు భారతీయ రైల్వే, కొంకణ్‌రైల్వే సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి. దూర ప్రాంతాలకు నడిచే ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, ఇంటర్‌ సిటీ రైళ్లు, ప్యాసింజర్‌ రైళ్లు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అన్ని సబర్బన్‌ రైళ్లు, కోల్‌కతా మెట్రో రైళ్లు, పూర్తిగా క్యాన్సల్‌ చేసింది. 31వ తేదీ రాత్రి 12 గంటల వరకు రైళ్ల రాకపోకలపై నిషేధం విధించినట్లు పేర్కొంది. సరుకులు రవాణా చేసే గూడ్స్‌ రైళ్లు యథావిధిగా నడుస్తాయి.