మావోయిస్టుల మృతదేహాలు తరలింపు

ఖమ్మం, జనంసాక్షి: భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రి నుంచి మావోయిస్టుల మృతదేహాలను ఛత్తీస్‌గఢ్‌లోని కుంటకు తరలించారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి వచ్చిన ప్రత్యేక హెలికాప్టర్‌లో మృతదేహాలను తరలించినట్లు తెలుస్తుంది. మృతదేహాలను అక్కడే పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు సమాచారం. అయితే మావోయిస్టుల బంధువులు మాత్రం ఇక్కడే పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను తమకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు మాత్రం వారిని పట్టించుకోలేదు. ప్రభుత్వ తీరుపై వరవరరావుతో పాటు ఏపీసీఎల్సీ నేతలు మండిపడ్డారు.