మా హక్కులు సాధించే వరకు పోరాడుతాం.

పాలసీ దారులకు బోనస్ ను పెంచాలి.
ఎల్ఐసి ఏజెంట్ల అసోసియేషన్ నాయకులు.
ఎల్ఐసి కార్యాలయం ముందు శాంతియుత ధర్నా.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్1(జనంసాక్షి):
మా హక్కులను సాధించేవరకు పోరాడుతామని ఎల్ఐసి ఏజెంట్ల అసోసియేషన్ నాయకులు అన్నారు. ఎల్ఐసి ఏజెంట్ అసోసియేషన్ పిలుపుమేరకు దేశవ్యాప్త నిరసనలో భాగంగా గురువారం ఉదయం జిల్లా కేంద్రంలోని ఎల్ఐసి శాటిలైట్ కార్యాలయం ముందు ఏజెంట్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో శాంతియుత ధర్నా నిర్వహించారు.మధ్యాహ్నం 12 గంటల నుండి ఒంటి గంట వరకు గేటు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎల్ఐసి ఏజెంట్లు పలు నినాదాలు చేశారు.ఈ సందర్భంగా అసోసియేషన్ డివిజన్ అధ్యక్షుడు సుఖ జీవన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి, కోశాధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ పాలసీ దారులకు ఎల్ఐసి సంస్థ ఇస్తున్న బోనస్ ను పెంచాలని డిమాండ్ చేశారు. బ్రాంచి మరియు డివిజన్ కార్యాలయంలో సర్వీసింగ్ విధానాన్ని మెరుగుపరచాలని అన్నారు ఇన్సూరెన్స్ పాలసీలపై జీఎస్టీ విధించడం ఏంటని ప్రశ్నించారు. వివిధ రకాల ఆర్థిక సంబంధ కార్యకలాపాలపై విధించే వడ్డీరేట్లు తగ్గించాలని కోరారు. ఎల్ఐసి కార్యాలయంలో ఇచ్చే ప్రతి కాయితానికి రసీదు ఇవ్వాలని సూచించారు. పాలసీ బాండ్లు పోస్టల్ వారు ప్రింట్ చేసి పంపించే విధానాన్ని రద్దుచేసి పాత పద్ధతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. సిటిజన్స్ చార్టర్ ను స్థానిక భాషలోనే ముద్రించి బ్రాంచ్ కార్యాలయాల లో ప్రదర్శించాలని సూచించారు.ఏజెంట్లకు గ్రాడ్యూటీ 20 లక్షల వరకు పెంచాలని కోరారు. ఏజెంట్లు అందరికీ గ్రూపు మెడికల్యా వర్తింపజేలని అన్నారు.ఎల్ఐసి ఏజెంట్లను కేంద్ర ప్రభుత్వం ప్రొఫెషనల్ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. క్లియా ఏజెంట్లకు సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు వీరాచారి, బాదం శ్రీనివాసులు, ఏజెంట్లు సుధాకర్ రావు, బాల్ రెడ్డి, పాపులు, చంద్రశేఖర్ రెడ్డి, పసుపు ల లక్ష్మయ్య, వేణు, వెంకటయ్య గౌడ్, రాజేంద్రప్రసాద్, రాజయ్య, శ్రీనివాసులు, సందు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.