మిడ్డె మిల్స్ కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలిపిన సి.పి.ఐ నేతలు

కోటగిరి ఆగస్ట్ 7 జనం సాక్షి:-మండల కేంద్రంలోనీ తాసిల్దార్ కార్యాలయం ముందర మధ్యాహ్నం భోజన కార్మికులు చేస్తున్న సమ్మెకు సిపిఐ మండల కమిటీ సంపూర్ణ మద్దతును ప్రకటించారు.ఈ సమ్మెను ఉద్దేశించి సిపిఐ మండల కార్యదర్శి విటల్ గౌడ్ మాట్లాడుతూ గత ఏడు రోజులుగా సమ్మె నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులకు సిపిఐ మండల కమిటీ సంపూర్ణ మద్దతుతో పాటుగా వారి న్యాయపరమైన డిమాండ్లను ఈ ప్రభుత్వలు అమలు పరిచేంత వరకు వారి వెంట ఉంటామన్నారు.కెసిఆర్ అసెంబ్లీ సాక్షిగా మధ్యాహ్నం భోజన కార్మికులకు ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలి.పిల్లలకు పోషకాహారం ఇస్తేనే బావుండదు అని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం కనీసం కోడిగుడ్లు నిత్యావసర సరుకులు ఇవ్వకపోవడం సిగ్గుచేటని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం జిఎస్టి పేరుమీద కోడిగుడ్లు నిత్యావసర సరుకులు పెంచడం వలన మధ్యాహ్నం భోజన కార్మికులకు ఎలా గిట్టుబాటు అవుతుందని ప్రశ్నించారు.కావున రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయమై ఆలోచించి వెంటనే మధ్యాహ్న భోజన కార్మికులకు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ నిలబెట్టుకోని వారికి కనీస వేతనాలు 3000 అమలు చేసి,పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నీలి దత్తు,నీలి ప్రకాష్,జావిద్, తదితరులు పాల్గొన్నారు.