మితిమీరిన వేగాలతో వాహనాలు నడిపి ప్రమాదాలకు గురై మీ పై ఆధారపడిన కుటుంబాలను అనథలుగా చేసుకోవద్దు

-డి.ఎస్పీ ఎన్.సి.హెచ్ రంగ స్వామి.

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 30 (జనం సాక్షి);
ట్రాఫిక్ నియమాలు పాటించకుండా,అజాగ్రతతో వాహనాలు నడిపి వాహన దారులు ప్రమాదాలకు గురికావొద్దని తద్వారా తమ పై ఆధారపడిన కుటుంబాలను అనాథలుగా మార్చొద్దని, మద్యమం మత్తులో వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని డి.ఎస్.పి ఎన్.సి.హెచ్ రంగస్వామి అన్నారు. జిల్లా ఎస్పీ జె.రంజన్ రతన్ కుమార్ ఆదేశాల మేరకు ఈ వారంలో ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి మద్యం మత్తులో రోడ్లపై వాహనాలు నడుపుతున్న 55మందికి శుక్రవారం గద్వాల పట్టణంలోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో రోడ్డు సేఫ్టీ నియమాల పై ట్రాఫిక్ ఎస్సై విజయ్ భాస్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి డి.ఎస్పీ ఎన్ సి హెచ్ రంగ స్వామి,సాయుధ దళ డీఎస్పీ ఇమ్మానియేల్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు.ఈ సందర్భంగా డి.ఎస్పీ మాట్లాడుతూ ట్రాఫిక్ నియమ నిబంధనలు అతిక్రమించి రోడ్లపై వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని అన్నారు. మద్యం తాగి వాహనం నడపడం వల్ల కలిగే దుష్ఫలితాలను తెలియజేశారు. వాహన దారులు ట్రాఫిక్ నియమాలను పాటించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని, అజాగ్రత్తగా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురై తమ పై ఆధారపడ్డ కుటుంబాలను అనాథలుగా చేసుకోవద్దని అన్నారు.ప్రతిరోజు గద్వాల పట్టణంతో పాటు జాతీయ రోడ్డుపైన నిబంధనలు పాటించకుండా వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించి నిబంధనలు పాటించేలా వారికి అవగాహన కల్పిస్తున్నారు అని డి.ఎస్.పి రంగస్వామి అన్నారు. వీటితో పాటుగా ఈ హైవేపైనే రోడ్డు పక్కన ఉన్న జంక్షన్లను సులభంగా గుర్తించడానికి బ్లింకర్స్ ను ఏర్పాటు చేశారు.ఆర్టీసీ బస్సులు, ఆటోలకు ప్రత్యేకంగా స్టికర్లను అతికించి ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఆటో డ్రైవర్లు కచ్చితంగా లైసెన్స్ కలిగి ఉండాలని, ఆటోలో లౌడ్ స్పీకర్స్ ను నిషేధించాలని, తప్పనసరిగ్గా ఇన్సురెన్స్ సదుపాయం కలిగిఉండాలని, వేగంగా ప్రయణించడం వలన కలిగే నష్టాలపై కౌన్సెలింగ్ నిర్వహించారు.సాయుధ దళ డిఎస్పి ఇమ్మానియెల్ మాట్లాడుతూ వాహనదారులు పాటించాల్సిన నిబంధనలు, పాదచారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రతి పాఠశాల, కళాశాలకు గద్వాల ట్రాఫిక్ పోలీస్ లు వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు.గద్వాల ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ భాస్కర్ మాట్లాడుతూ ట్రాఫిక్ నియమ నిభందనలను గురించి అనగా డ్రంక్ & డ్రైవ్, ట్రిపుల్ రైడ్, పెండింగ్ ఈ చాలాన్స్, హెల్మెట్ ప్రాముక్యత ,డ్రైవింగ్ లైసెన్స్, ఓవర్లోడ్ ప్యాసింజర్, రాంగ్ రూట్, సిగ్నల్ జంప్, సెల్ ఫోన్ డ్రైవ్, సీట్ బెల్ట్, ఇన్సూరెన్స్ వాహన పత్రాలు మొదలైన వాటిని గురించి వివరించి, గతంలో జరిగిన సంఘటనలపైన వీడియోలు చూపించి వారికి అవగాహన కల్పించడం జరిగిందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది శివకుమార్, కృష్ణ నాయుడు,రామకృష్ణ, బలరాం,వాహనాలు దారులు తదితరులు పాల్గొన్నారు.