మిత్రుని కుటుంబానికి ఆర్థిక సాయం…
ఖానాపూర్ ఆగస్ట్ 05(జనం సాక్షి):
ఖానాపూర్ పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన గిరిదవరి పురుషోత్తం ఇటీవల అనారోగ్యం కారణంతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న చిన్ననాటి మిత్రులు 2001- 02 పదవతరగతి బ్యాచ్ మిత్రుల సహకారంతో రూ 22 వేలు ఆర్థిక సహాయంగా గిరిదవరి పురుషోత్తం భార్య రాధకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిదవరి పురుషోత్తం ఇద్దరి పిల్లలను ఎలాంటి ఆటంకం కాకుండా ఉన్నత చదువులను అభ్యసించాలన్నారు. ఇక ముందు కుటుంబానికి ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తామని భరోసా కల్పించారు. తమ పిల్లల చదువుల కొరకు ఈ డబ్బులను వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలేరీ దివాకర్, రాజు, దాసరి కృష్ణమూర్తి, దాసరి రాజేశ్వర్, మునుగురి నరేందర్, వేల్పుల అశోక్ తదితరులు పాల్గొన్నారు.