మిద్దె రాములు ఒగ్గుకధకు జాతీయ పురస్కరం
ఆకాశవాణి డాక్యుమెంటరీ తో గుర్తింపు
హైదరాబాద్: మిద్దె రాములు ఒగ్గుకథ పై ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రూపొందిచిన ‘ఎల్లమ్మ కొడుకు రాములు’ డాక్యుమెంటరీకి జాతీమ పురస్కారం లభించింది. జాతీయ స్థాయిలో ఇచ్చే ఆకాశవాణి వార్షిక పురస్కారాలు -2011 లో ఈ అవార్డు వచ్చిందని హైదరాబాద్ కేంద్రం సంచాలకుడు ఎం.ఆదిత్యప్రసాద్ శక్రవారం ఓ ప్రకటన లో తెలిపారు. కరీంనగర్ జిల్లా వేములవాడలో మిద్దె రాములు సృష్టించిన జానపద ప్రదర్శన ఒగ్గుకధకు ఆయన గాన, అభినయ పాటవాల కారణంగా ఎనలేని ఆదరణ లభించింది. రాములు ప్రతిభ కారణంగా ఈ జానపద ప్రదర్శన అంతరించకుండా ఎలా ప్రాచుర్యం పొందిందో వివరిస్తూ ఆకాశ వాణి కేంద్రం ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ సుమనస్పతిరెడ్డి ఈ డాక్యుమెంటరీని రూపొందించారు.