మినిస్టర్స్ క్వార్టర్స్‌ను ముట్టడించిన టీఆర్ఎస్-కేటీఆర్ అరెస్ట్
హైద్రాబాద్: రైతులకు ఏడు గంటలు విద్యుత్ ఇవ్వాలంటూ టీఆర్ఎస్ మినిస్టర్స్ క్వార్టర్స్‌ను ముట్టడించింది. టీఆర్ఎస్ నేత కెటీఆర్ ఆధ్వర్యంలో కార్యకర్తలు రైతులకు విద్యుత్ అందించేందుకు ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తూ మినిస్టర్స్ క్వార్టర్స్ వద్దకు చేరుకొని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఎమ్మెల్యే కేటీఆర్‌ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా కార్యకర్తలు అడ్డుకొన్నారు దీంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. చివరికి కార్యకర్తలను తోసేసిన పోలీసులు కేటీఆర్‌ను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.