మినీ స్టేడియంలో వాకింగ్ ట్రాక్ లేక ఇబ్బంది పడుతున్న వాకర్స్ : టీపీసీసీ సభ్యులు
జనం సాక్షి : నర్సంపేట
నర్సంపేట పట్టణంలోని మల్లంపల్లి రోడ్డులోని మినీ స్టేడియం గ్రౌండ్ ను వాకర్స్ తో కలిసి ఈరోజు ఉదయం మినీ స్టేడియంను టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ పరిశీలించారు. ఈ సందర్భంగా రామానంద్ మాట్లాడుతూ మినీ స్టేడియంలో సరైన వాకింగ్ ట్రాక్ లేక గుంతలతో వాకర్స్ ఇబ్బంది పడుతున్నారని పెండెం రామానంద్ అన్నారు. మినీ స్టేడియం గ్రౌండ్ లో గతంలో ఎమ్మెల్యే వచ్చి పట్టణ ప్రగతి కింద మంజూరు అయిన 5 లక్షల రూపాయలు మరియు మహబూబాబాద్ రోడ్డు కుమ్మరికుంట పార్క్ పక్కనున్న గ్రౌండ్ లో 5 లక్షలు మంజూరు చేసి మొక్కుబడిగా గోడలకు పిల్లర్స్ లేకుండా తగిలించిన రెండు గేట్లు ఒక పుల్లింగ్ స్టాండ్ ఒక బార్ స్టాండ్, వాలిబాల్ 2 పోల్స్, కోకో పోల్స్ మరియు దోజర్ పెట్టి గ్రౌండ్ లో గడ్డిని చదును చేయడం జరిగింది. వీటికి 5 లక్షల రూపాయలు, మరియు మహబూబాబాద్ రోడ్డు లో ఉన్న పార్క్ యందు 5 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని చెప్పారు కానీ ఈ రెండు గ్రౌండ్లో కలిపి సుమారు ఒక లక్ష రూపాయలు కూడా ఖర్చు చేయలేదు మిగిలిన 8 లక్షలు దుర్వినియోగం అయినట్టు కనబడుతున్నాయి. దీనికి స్థానిక చైర్మన్ కమిషనర్ బాధ్యత వహించలన్నారు.నిధులు దుర్వినియోగం అయిన విషయాన్ని సాక్ష్యాధారాలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రజలు నడవడానికి అసౌకర్యానికి గురవుతున్నారన్నారు. ట్రాక్ వేయాలని చెప్పి కోరడం జరిగిందన్నారు. మరి మీరు అధికార పార్టీ నాయకులు మేల్కొని కనీసం ఒక లక్ష రూపాయలు పెడితే ఈ ట్రాక్ పూర్తి అవుతుందని మీరు తక్షణమే ఈ పనులు ప్రారంభించాలని కోరుకుంటున్నామని లేనియెడల ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు