మిర్చి సాగు లో సేంద్రియ పద్ధతులు అవలంబించాలి

జిల్లా వ్యవసాయ అధికారి విజయ భాస్కర్*
రేగొండ (జనం సాక్షి): సేంద్రియ పద్ధతిలో మిర్చి పంటలు సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చునని జిల్లా వ్యవసాయ అధికారి విజయభాస్కర్ తెలిపారు. సోమవారం రేగొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో పసిడి పంట స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జాతీయ సుస్థిర సుగంధ ద్రవ్యాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్ ఎస్ ఎస్ పి లో భాగంగా మండలానికి చెందిన రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులకు మిర్చి పంటల సాగుపై అవగాహన కనిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగాజరైన జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ మిర్చి విత్తనాలు నాటేముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎత్తు నారుమడులు చేసుకోవాలని సూచించారు. రసాయనిక పురుగు, మందులు, ఎరువులను ఎక్కువ మోతాదులో వాడొద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో రేగొండ వ్యవసాయ అధికారి పెద్ది వాసుదేవరెడ్డి, పంటల సీఈవో కృష్ణయ్య, వెంకటేశ్వర్, సందీప్, శ్రీనివాస్, ఎన్ఎస్ఎస్పి ఎన్జీవో నుండి పుష్ప రెడ్డి, అనూష తదితరులు పాల్గొన్నారు.