మిషన్ కాకతీయలో ప్రజలు భాగస్వాములు కావాలి:హరీశ్ రావ్
మెదక్: మిషన్ కాకతీయలో ప్రజలు భాగస్వాములు కావాలని మంత్రి టి.హరీష్‌రావు పిలుపునిచ్చారు. మెదక్ జిల్లాలోని చిన్నకోడూరులో మిషన్ కాకతీయ పనులను ప్రారంభించిన మంత్రి మాట్లాడుతూ వచ్చే ఏడాది నుంచి రైతులకు 9గంటల విద్యుత్ ఇస్తామని అన్నారు. ఆంధ్ర పాలకుల వల్లే తెలంగాణలో చెరువులు నాశనమయ్యాయని ఆరోపించారు.