మిషన్ భగీరథ నీళ్ళు లీకౌతున్నా పట్టించుకోని అధికారులు.
కోడేరు (జనంసాక్షి) అక్టోబర్ 12 కోడేరు మండల కేంద్రంలోని పోచమ్మ గుడి ఆపోజిట్ లో మిషన్ భగీరథ పైపు లాకులు పగిలిపోయి నీరు వృధాగా పారుతున్న దారికి పక్కనే ఉన్న చూసి చూడనట్టు వెళుతున్నటువంటి సంబంధిత అధికారులు అకాల వర్షాల కారణంగా పైపులు లీకైనవి అని చెప్పి ఒక రెండు మూడు రోజులు గ్రామంలో నీటి సరఫరా ఆగిపోవడం జరిగింది. అది ఒక కారణంగా మరమతు చేయడానికి ఇబ్బంది ఉందని తెలియజేపిన గ్రామపంచాయతీ ఇట్లాంటి వాటికీ చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. నీరు వృధా కాకుండా గ్రామంలోని అన్ని వీధులకు నీరు సమృద్ధిగా పంపిణీ చేయటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లాంటి మరమ్మతులను వెంటనే చేపట్టి కలుషితం నీరు కాకుండా సురక్షితమైన నీటిని సరఫరా చేయాలని చెప్పి సిపిఎం పార్టీ కోడేరు గ్రామ కమిటీ కార్యదర్శి పి రవి తెలిపారు.